SSC Exams - OMR Sheet

                                 
 *SSC OMR షీట్ - అవగాహన*

* OMR sheet అనేది విద్యార్థి తాలూకు అన్ని వివరములను -డీకోడ్ చేయబడిన ఒక ప్రోగ్రామ్ షీట్

 పార్ట్-1,2,3

ఈ మూడింటిలో కూడా బార్ కోడ్ ఉంటుంది.

*ఈ బార్ కోడ్ ను డామేజ్ చేయకుండునట్లు జాగ్రత్త వహించవలెను.*

ఇందులో పార్ట్ 2 లో షేడెడ్ మార్క్స్ పైన పిన్నింగ్ చేసి,స్టిక్కర్లు  సంబందిత ఇన్విజిలేటర్ అతికిస్తాడు. తొందరపడి విద్యార్థులు దీనిని నింపరాదు.

★సాధ్యమైనంత వరకు జెల్ పెన్నులు వాడకుంటే మంచిది. బ్లూ,లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వాడితే మంచిది.

★OMR పై విద్యార్థి చేసేవి: (3-పనులు)

 ●సంబందిత గడిలో  మెయిన్ ఆన్సర్ బుక్  లెట్ నంబర్ ను వేయించాలి.

 ●సంబందిత గళ్లలో  ఎన్ని అడిషినల్స్తీ తీసుకున్నామో వాటి సంఖ్య వేయాలి.

●సంబందిత గడిలో  విద్యార్థి సంతకం.

●ఆ తరువాత, ఇన్విజిలేటర్ సంతకం ,బాక్స్ లో చెయ్యాలి.

★ఒక్క ప్రశ్న పత్రం పై తప్ప హాల్ టికెట్ నంబర్ ను ఎక్కడా వేయాల్సిన పని లేదు.

బిట్ పేపర్ పై,
గ్రాఫ్ పై,
మ్యాప్ పై,
అడిషినల్స్ పై మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్  వేయించాలి.

ఒక వేళ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుండి మిగతావి విడివడినా ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఆధారంగా వాటిని గుర్తించుటకు వీలుంటుంది.

★ప్రతి జవాబు వ్రాయటం అయిపోయిన తర్వాత దానిని ఒక గీత తో డీమార్కేట్ చేస్తే బావుంటుంది.

★ఛాయిస్ చివరిలో వ్రాస్తే మంచిది.
★CCE విధానం కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను కూడా వదలకుండా దగ్గరి జవాబు ను వ్రాయమని తెలియచేయాలి.

★ప్రతి అడిషినల్ షీట్ కుడి వైపున కార్నర్ లో పైన పెన్సిల్ తో నెంబర్ వేయించాలి 
(దారంతో కట్టేటప్పుడు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా ఉంటుంది..)

SSC EXAMS -Instructions to Students




                        *పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు కొన్ని సూచనలు*
 
👉 *ప్రతిరోజు ఉదయం 9 గంటల కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.*

👉 *పరీక్ష కేంద్రం బయట ఏ గదిలో ఏ హాల్ టికెట్ నెంబర్ నుండి ఏ హాల్ టికెట్ నెంబర్ వరకు కేటాయించబడినవో డిస్ప్లే ఉంటుంది దాని లో మీ గదిని చూసుకొని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాలి.*

👉 *మీకు కేటాయించబడిన గదిలోకి వెళ్లి మీకు కేటాయించబడిన స్థలంలో 9.15 లోపు కూర్చోవాలి.*

👉 *9.15 తర్వాత మీకు కేటాయించబడిన ఇన్విజిలేటర్ గారు OMR షీట్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది.*

👉 *మెయిన్ ఆన్సర్ షీట్ పైన మూడు అంకెల క్రమసంఖ్య రాయ బడి ఉంటుంది.* 

👉 *ఈ సంఖ్యను ఓ ఎం ఆర్ షీట్ నందు పార్ట్ 1& పార్ట్ 2 రెండు చోట్ల రాయాల్సి ఉంటుంది.*

👉 *ఓఎంఆర్ షీట్ ఇచ్చిన వెంటనే దానిలో ముద్రించబడిన మీ పేరు, మీడియం ,రాస్తున్న పరీక్ష పేరు వివరాలు ప్రతి రోజూ తప్పక సరి చూసుకోవాలి.*

👉 *సరి చూసుకున్న తర్వాత ఓఎంఆర్ షీట్ను మెయిన్ ఆన్సర్ షీట్ కు స్టాపిల్ (పిన్)చేసి దాని మీదుగా రెండు చోట్ల ఒకవైపు అర్థ వృత్తాకారం వచ్చే విధంగా స్టిక్కర్ ను అతికించుకోవాలి.*

👉 *మెయిన్ ఆన్సర్ షీట్ లో మొదటి పేజీ నందు సూచనలు ఉంటాయి కాబట్టి రెండవ పేజీ నుండి జవాబులు రాయడం మొదలు పెట్టాలి ఓఎంఆర్ షీట్ లో మీ వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత మీరు సంతకం చేసినట్లయితే మీ సంతకం క్రింది భాగంలో ఇన్విజిలేటర్ గారు సంతకం చేస్తారు. మీ యొక్క సంతకం చేసే గ‌డిని సరిగ్గా చూసుకొని నాలుగు గీతలకు తగలకుండా మీ సంతకాన్ని హాల్ టికెట్ లో ఉన్న మాదిరిగా చేయవలసి ఉంటుంది.*

👉 *ఇన్విజిలేటర్ అందించే అటెండెన్స్ షీట్ నందు మీ హాల్టికెట్ మాదిరిగా వివరాలన్నీ నమోదు చేయబడి, మీరు రాసే పరీక్ష తేది, పేపర్ కోడ్ క్రింద ఖాళీ గ‌డి ఉంటుంది. ఏ రోజు ఏ పరీక్ష రాస్తున్నారో ఆ తేదీ పరీక్షకు సరిచూసుకొని ఆ ఒక్క గదిలో మాత్రమే మీరు సంతకం చేయవలసి ఉంటుంది.*

👉 *ఈ ప్రక్రియ అంతా 9 గంటల 30 నిమిషాల వరకు పూర్తి చేయబడినట్లయితే 9.30కు మీకు ప్రశ్నా పత్రం ఇవ్వడం జరుగుతుంది.*

👉 *ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాల పాటు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని పరీక్ష రాయడం మొదలు పెట్టాలి. పరీక్ష పేపరు చదువుకోవడానికే 15 నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది.*

👉 *జవాబులు రాయడం మొదలు పెట్టిన తర్వాత ప్రతి జవాబు ముగిసిన వెంటనే ఒక లైన్ గీసినట్లయితే ఎగ్జామినర్ కు మీ జవాబు అక్కడికి పూర్తయినది అని తెలిసి మార్కుల కేటాయింపు సులభమవుతుంది*

👉 *చివరి అరగంట సమయం మిగిలి ఉన్నప్పుడు మీకు పార్ట్-బి ఇవ్వడం జరుగుతుంది.పార్ట్-బి సమాధానాలు రాసేటప్పుడు ఎలాంటి దిద్దుబాటు కానీ, ఓవర్ రైటింగ్ కానీ, రౌండ్ చేయడం కానీ ఉండరాదు. మీరు సరిగా ఆలోచించుకొని ఒకే ఒక్క సరి అయిన ఆప్షన్ మాత్రమే బ్రాకెట్లో రాయాలి*

👉 *మీరు అడిషనల్ తీసుకున్న ప్రతి సారి కుడి వైపు పై భాగాన చిన్నగా పెన్సిల్ తో 1,2,3 అని అడిషనల్ యొక్క క్రమ సంఖ్యను వేసుకున్నట్లయితే చివరగా పేపర్ను క‌ట్ట‌డం సులభమవుతుంది.*

👉 *జవాబులు అన్నీ రాయడం ముగిసిన తర్వాత ఇంకనూ అడిషనల్ పేపర్ లో ఖాళీ స్థలం ఉన్నట్లయితే చివరి జవాబు తర్వాత మిగిలిన ఖాళీ స్థలంలో కర్ణం మాదిరిగా గీత గీసి మీ పరీక్ష పత్రాన్ని ఇన్విజిలేట‌ర్కు అందజేయాలి.*

*ఇన్విజిలేటర్ కు జవాబు పత్రాన్ని  అందజేయడానికి కన్నా ముందు ప్రధాన జవాబు పత్రం తోపాటు అడిషనల్ జవాబు పత్రాలన్నీ క్రమంలో ఉన్నాయో లేదో సరి చూసుకొని సరిగ్గా అంటే గట్టిగా ముడి ఊడిపోకుండా ట్యాగ్ కట్టి ఇవ్వాల్సి ఉంటుంది.*

*పరీక్ష సమయం 12 గంటల 30 నిమిషాల వరకు కాబట్టి మీరు అంతకుముందే జవాబులు రాయడం పూర్తి చేసినప్పటికీ మిమ్మల్ని 12.30 వరకు ఎగ్జామ్ సెంటర్ విడిచి వెళ్లడానికి అనుమతి ఇవ్వరు.*

*ప్రత్యేక సందర్భాలు:*

👉 *గణితం పేపర్ కొరకు మీరు గ్రాఫ్ పేపర్ ఉపయోగించినట్లయితే దానిని అడిషనల్ పేపర్ ల తర్వాత పార్ట్ బి కన్నా ముందుగా కట్టాల్సి ఉంటుంది*

👉 *భౌతిక రసాయన శాస్త్ర పరీక్ష ఒక గంట ముప్పై  నిమిషాలు, జీవశాస్త్ర పరీక్ష ఒక గంట ముప్పై  నిమిషాలు ఉంటుంది. ఆ ఒక గంట ముప్పై  నిమిషాల లో చివరి 30 నిమిషాలముందు ఆయా సబ్జెక్టుల పార్ట్-బి లు ఇవ్వబడతాయి *


👉 *అదేవిధంగా సాంఘికశాస్త్ర పరీక్షలో మ్యాప్ పాయింటింగ్ కొరకు ఇచ్చినటువంటి మ్యాప్ను కూడా అడిషనల్ పేపర్ ల తర్వాత కట్టి చివరగా పార్ట్ బీ కట్టాల్సి ఉంటుంది.*

👉 *ముఖ్య గమనిక: హాల్టికెట్ నెంబర్ ను   కేవలం ప్రశ్నపత్రం పైన మాత్రమే రాయాలి. మ‌రి ఎక్క‌డ కూడా రాయరాదు.*
*జవాబులు రాయడం పూర్తయిన తర్వాత నంబర్ ఆఫ్ అడిషనల్ అనగా మీరు తీసుకున్న అడిషనల్ ల‌ సంఖ్యను లెక్కించి ప్రధాన జవాబు పత్రం పై ఒక చోట ఓఎంఆర్ షీట్ నందు పార్ట్ వన్ పార్ట్ 2 మొత్తం మూడు చోట్ల సంఖ్య వ్రాసి ఇన్విజిలేట‌ర్కు అందజేయాల్సి ఉంటుంది.*

*All the Best*


Moral Story : 125



💦 *నీతి కథలు - 125*

*రంగడికి బుద్ధొచ్చింది*

రామాపురం అనే గ్రామంలో రంగడు అనే బాలుడు ఉండేవాడు. వాడికి సోమరితనం ఎక్కువ. ఒక్కపని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బడికి వెళ్ళమని పంపిస్తే మధ్యలో బడి ఎగ్గొట్టి ఊరవతలి మైదానానికి వెళ్ళి ఆడుకునేవాడు. తల్లితండ్రులు ఎంత చెప్పినా, కొట్టినా తన ప్రవర్తనను మార్చుకునేవాడు కాదు.

ఒకరోజు రంగడికి ఆడుకోవడానికి ఎవరూ కనిపించలేదు. సరిగా ఆ సమయంలో వాడికి ఒక చీమ కనబడింది. ఆ చీమ ఆహారం మోసుకుని హడావుడిగా వెడుతోంది. ‘‘చీమా, చీమా ఎక్కడికి ఆ పరుగు. కాసేపు ఆగు. ఆడుకుందాం’’ అని అడిగాడు.

‘‘నాకు అంత సమయం లేదు. వానాకాలం ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఆహారం సంపాదించకపోతే రేపు నేను చాలా కష్టపడతాను. నేను రాను’’ అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది చీమ.

ఏమీ తోచక అలా బయటకు వెళ్లిన రంగడికి, చెట్టు కొమ్మ మీద కూర్చుని అరటిపండు తింటున్న ఒక కోతి కనిపించింది. ‘‘కోతి బావా! కోతి బావా! కోతికొమ్మచ్చి ఆడుకుందామా?’’ అని అడిగాడు.

‘‘అమ్మో! నీతో నేను ఏ ఆటా ఆడలేను. మా యజమానితో నేను పట్నానికి వెళ్ళాలి. ఎన్నో తమషా ఆటలు ఆడి డబ్బు సంపాదించి పెట్టాలి. అతని కోసం ఎదురుచూస్తున్నాను. అదుగో మాటల్లోనే వచ్చేశాడు. ఇంకెప్పుడైనా ఆడుకుందాం. వస్తాను’’ అంటూ కోతి చెట్టు దిగి పరుగెత్తింది.

రంగడికి ఎంతో నిరాశ కలిగింది. సరిగ్గా అప్పుడే ఒక ఎద్దు పొలం వైపు వెళ్తూ కనిపించింది. ‘‘ఎద్దు మామా! ఎద్దుమామా! నాతో కాసేపు ఆడవా?’’ అని అడిగాడు.

‘‘ఇప్పుడు నేను పొలానికి వెళ్ళాలి. పంటలు పండించడానికి బోలెడంత పని చేయాలి. ఇప్పటికే నాకు ఆలస్యం అయ్యింది. రైతు అక్కడ నా కోసం ఎదురుచూస్తూంటాడు. నేను రాలేను!’’ అని చెప్పి ముందుకు కదిలింది ఎద్దు. అది విని రంగడు ఆలోచనలో పడ్డాడు. ‘అమ్మానాన్నలు పనుల్లోకి వెళ్ళారు. పిల్లలంతా చదువుకోవడానికి వెళ్ళారు. ఇళ్లలో ఉన్న ముసలివారు కూడా ధాన్యం బాగు చేయడం లేదా, చిన్న పిల్లల్ని చూస్తూ ఇంటికి కాపలా ఉన్నారు. ఇలా ప్రతివారూ ఏదో ఒక పని చేస్తున్నారు. తనొక్కడేనా ఏ పనీపాటా లేకుండా ఉన్నది?’ ఈ ఆలోచన కలుగగానే రంగడికి తను చేస్తున్న తప్పేమిటో అర్థం అయింది. ఇక ఆరోజు నుండి తన ప్రవర్తన మార్చుకుని బుద్ధిగా బడికి వెళ్ళసాగాడు.
            💦🐬🐥🐋💦
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పులను సరిదిద్దు కోలేడు. నేటి కంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో మార్పు అవసరం. "_
               _*- ఎడ్వర్డ్*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" అభిరుచిని బట్టే ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనే మన విధిని నిర్దేశిస్తుంది "_

         💦🐋🐥🐳💦

Moral Story : 124



💦 *నీతి కథలు - 124*

*వింతగొర్రె*

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది.


వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది.

ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ‘ఇదేమి విచిత్రం, సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది. కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది.


ఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి న ఊళ్లోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి
           💦🐬🐥🐋💦
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" డబ్బు తప్ప ఇతరత్రా ఏమీ లేని వాడే ప్రపంచంలో అందరికంటే నిరుపేద. "_
              _*- ఫ్రాన్సిస్ బేకన్*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" ఎవరినైనా పదిమందిలో ప్రశంసించు. అవసరమైతే ఏకాంతంలో మందలించు "_

         💦🐋🐥🐳💦

Motivational Story : 3



విజయం అంటే ఏమిటి ?.....

మన దేశం నుండీ ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ '' విజయం అంటే ఏమిటి? '' అని అడిగితే ఒక యువతి '' విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం , '' అనింది. 
అపుడు ఆ ప్రొఫెసర్ '' అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? '' అంటే ఎవరూ చెప్పలేదు. [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి] బ్ర్తతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు. అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.   
మరో యువకుడు లేచి '' విజయం అంటే బలం / శక్తి '' అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్ , నెపోలియన్ ,ముస్సొలిని ,హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాదెన్ ... వీళ్ళంతా బలవంతులు , ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా , వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ?  వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల  కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట. 
మరో యువతి '' విజయమంటే ప్రఖ్యాతి , అందం  ,''  అనింది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు.  భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి  , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట .   

మరోసారి మరొకరు '' విజయమంటే అధికారం '' అని అన్నారు. అయితే '' కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి '' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు. మా అనంతపురంలో  ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట. 

చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు  - '' విజయం అంటే ఏమిటి ? '' అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , '' మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా ? '' అందరూ '' తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా ? ''అని అడిగితే అయిదారుమంది ''తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా ? '' '' తెలియదు '' అన్నారు. 
అపుడు ప్రొఫెసర్ గారు '' శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , క్రీస్తు , మహమ్మద్ ప్రవక్త తెలుసా ? ''   అందరూ '' ఓ , తెలుసు '' అని ముక్తకంఠం తో బదులిచ్చారు. '' మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు ?  '' 
అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది : '' సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే : '
 తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే ! '' 

'' నా గురించి నేను దు:ఖించకపోవడమే నా ఆనందానికి కారణం '' అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , '' ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క '' [ Only they live who live for others , the others are more dead than alive]  అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.