Moral Story : 12

 నీతి కథలు- 12

తెలివి

    ఒక ముసలి గాడిద పాపం పొరపాటున కాలు జారి బావిలో పడిపోయింది. దాంతో పైకి వచ్చే దారిలేక ఘోరంగా ఆర్తనారాలు చేయడం మొదలుపెట్టింది. కనీసం తన పెడబొబ్బలు వినైనా ఎవరైనా తనను కాపాడతారని దాని ఆశ. కాని దాని యజమాని ఆలోచనలు మాత్రం మరొకలా ఉన్నాయి.

    ఈ గాడిగ ఎలాగూ ముసలిదైపోయింది. ఇక దీన్ని బయటకు తీసి ఏం లాభం? మేత దండగ. పైగా బావి కూడా ఎందుకూ పనికి రాకుండా పాడుబడిపోయింది. కాబట్టి ఈ గాడిదను అందులో అలాగే వదిలేస్తే సరిపోతుంది.’ అనుకున్నాడు. అంతేకాదు ఆ గాడిద బతికుండగానే ఆ బావిని మట్టితో పూడ్చేయాలని కూడా నిర్ణయించుకుని మట్టిని తవ్వి బావిలో పొయ్యడం మొదలుపెట్టాడు. కొంచెం సేపటికి బాగా అలసటగా అనిపించి, ఆ పనిలో సాయం చేసేందుకై తనకు తెలిసిన నలుగురిని పిలుచుకొచ్చాడు. వాళ్ళు కూడా ఎడాపెడా మట్టిని తోడి బావిలో పొయ్యిసాగారు.

    మొదట్లో కొద్దిసేపటి దాక గాడిద పాపం హృదయ విదారకంగా అరిచింది. ఆ తరువాత ఉన్నట్టుండి. అది అరవడం మానేసింది. బావిలోకి ఆఘమేఘాల మీద మట్టిని తోడి పోస్తున్న పెద్దమనుషులు దీనిని అసలు గమనించనే లేదు. ఏదో పూనకం వచ్చిన వాళ్ళలా తట్టలతో మట్టిని నింపి దాన్ని అదే పనిగా బావిలోకి కుమ్మరిస్తూ పోయారు.

    పని పూర్తి కావస్తోంది. ఇంకో 30 గంపలు మట్టిని పోస్తే చాలు. బావి పూర్తిగా నిండిపోతుంది. అయితే, ఇంతలో ఉన్నట్టుండి బావిలోంచి గాడిద చెంగున బయటకు దూకింది. అప్పటిదాకా చెమటలు కక్కుతూ బావిలోకి మట్టిని పోస్తున్న పెద్దమనుషులంతా నోళ్ళు వెళ్ళబెట్టి నిలబడిపోయారు.

    అసలింతకూ ఏం జరిగిందంటే తన మీద మట్టి పడటం మొదలవగానే గాడిదకు అసలు విషయం అర్దమైపోయింది. అందుకే అది గుండెలవిసేలా ఏడ్చింది. అయితే ఉన్నట్టుండి దానికో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన మీద పడే మట్టిని ఎప్పటికప్పుడు కింద దులిపేసి దాని మీద నిలబడితే , వెంటనే అది దాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. మనుషులు వేసే మట్టిని ఎప్పటికప్పుడు దులిపేస్తూ, ఎలాగైతేనేం అది మళ్ళీ బావిలోంచి బయటపడింది.

*******

◦•●◉✿ - ✿◉●•◦
 మహానీయుని మాట 
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
" అభ్యాసము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, ధ్యానం కన్నా కర్మ ఫల త్యాగము శ్రేష్టము "
           - భగవద్గీత
     。☆✼★━━━━★✼☆。
 నేటీ మంచి మాట 
     ♡━━━━━ - ━━━━♡
" ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది "

******

@    Class & Subject wise Study Material :

    #    6th Class    #    7th Class    #    8th Class    #    9th Class    #    10th Class