Moral Story : 61

 *నీతి కథలు - 61*


*కలనుంచి గుణపాఠం*

    ‘ఒరే, ఆపరా! దాన్నెందుకలా కొడతావు? ఆ కుక్క నీకేం హానిచేసింది? అనవసరంగా దాన్నెందుకలా కొడుతున్నావు?’’ అని అడ్డుకు న్నాడు గోపాల్‌ అన్నయ్య రాజును. కుక్కలను కొట్టడం అన్నా, వాటిపై రాళ్ళు విసరడం అన్నా రాజుకు మహాసరదా. కుక్కల్నే కాదు; తూనీగలనూ, సీతాకోక చిలుకలనూ పట్టి వాటి రెక్కలను విరిచేవాడు. దారం కట్టి వదిలేవాడు.

    బడిలో కూడా వాడు ఎగిరే తూనీగలనూ, సీతాకోక చిలుకలనూ పట్టి జేబు రుమాలులో దాచి అదిమి ఊపిరాడకుండా చేసేవాడు.
    రాజు తమ్ముడు గోపాల్‌ ఇంటికి రాగానే, అమ్మతో అన్న చేసే దుందుడుకు చేష్టల గురించి చెప్పేవాడు. అమ్మ కోపంతో, ‘‘ఏరా, వాటినెందుకలా హింసిస్తావు పాపం! వాటినలా హింసించావంటే తప్పక శిక్ష అనుభవిస్తావు, జాగ్రత్త,’’ అని మందలించేది. అలా తల్లి ఒకనాడు మందలించి నప్పుడు రాజు గట్టిగా నవ్వి, ‘‘అవి నా వేలెడంత లేని అల్ప ప్రాణులు! నన్నెలా శిక్షస్తాయమ్మా?’’ అన్నాడు హేళనగా.

      ‘‘నవ్వొద్దు. అవి శిక్షంచక పోయినా, దేవుడు నిన్ను శిక్షస్తాడు,’’ అన్నది తల్లి కోపంగా. రాజు, ‘‘అప్పుడు చూసుకుందాంలే,’’ అంటూ వెళ్ళి పడుకున్నాడు. అదే ఆలోచనతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మరునాడు తెల్లవారి కళ్ళు తెరిచి నప్పుడు వింతగా తోచడంతో తన్ను ఒకసారి పరిశీలనగా చూసుకున్నాడు. తన రెండు చేతులూ లేవు. భోరున విలపిస్తూ, ‘‘అమ్మా, అమ్మా,’’ అంటూ అతి కష్టం మీద లేచి కూర్చున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన గోపాల్‌, ‘అరరె, నిజంగానే నీకు చేతులు లేవే? ఎక్కడికి వెళ్ళాయి?’’ అంటూ ఆశ్చర్యపోయాడు.


    ‘నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను హింస మానుకోరా, హింస మానుకోరా అని. విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఏమయిందో. ఆ దేవుడే నిన్ను శిక్షంచాడనుకుంటాను,’’ అన్నది తల్లి బాధగా.

    రాజు, గోపాల్‌ సాయంతో బడికి వెళ్ళాడు. తోటి విద్యార్థులందరూ వాణ్ణి చూసి నవ్వారు. పరిహసించారు. ఆటపట్టించారు. రాజు అవ మానంతో కుంగిపోయాడు. ఏపనీ చేసుకోలేక పోయాడు. మరీ బాధ అనిపించింది. ఇంటికి తిరిగివస్తూంటే, వీధిలోని కుక్కలూ, కుక్క పిల్లలూ వాణ్ణి తరుముకున్నాయి. వాటి నుంచి తప్పించుకుని అతి కష్టం మీద ఇల్లు చేరుకున్నాడు. వాడు కూర్చుంటే చుట్టూ ఈగలు ముసిరాయి. వాటిని తరమలేక నానా యాతన పడ్డాడు.

     రాజు తను నిన్నటిదాకా హింసించిన ప్రాణుల గురించి ఒకసారి తలుచుకున్నాడు. తను హింసిస్తూంటే ఆ అల్పజీవులు ఎంతటి బాధ అనుభవించివుంటాయి? అని పశ్చాత్తాప పడ్డాడు. మునుముందు ఏ ప్రాణికీ, ఎలాంటి హానీ చేయకూడదని నిర్ణయించాడు. మనసులోనే దేవుడి మీద ప్రమాణం చేశాడు. ఆ మాటను తల్లికి కూడా చెప్పి, వెళ్ళి పడుకున్నాడు. మరునాడు నిద్రలేవగానే తన శరీరం కేసి చూసుకున్నాడు. రెండు చేతులూ …యథాస్థానంలో ఉన్నాయి. ‘‘ఆహా, నాకు చేతులు వచ్చేశాయి! చేతులు వచ్చేశాయి!!’’ అని అరవసాగాడు. ‘‘రాజు, లే,’’ అంటూ తమ్ముడు వచ్చి వాణ్ణి కుదపసాగాడు. వాడు కళ్ళు తెరిచాడు. వాడి కుటుంబ సభ్యులందరూ చుట్టూ చేరి వింతగా చూస్తున్నారు. ‘‘ఆహా, ఇదంతా కల! నిజం కాదన్న మాట!’’ అంటూ గాఢంగా నిట్టూర్చాడు. తన కల గురించి వాళ్ళకు చెప్పి, ‘‘అమ్మా, నా కల నుంచి నేను గుణపాఠం నేర్చుకున్నాను. ఇకపై బుద్ధిగా నడుచుకుంటాను,’’ అన్నాడు. తల్లిదండ్రులూ, తమ్ముడు గోపాల్‌ ఎంతగానో సంతోషించారు.
            
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" వేగంగా నడిచి కృత్రిమ ఆనందాన్ని పొందేదానికంటే , ఘన విజయాలు సాధించటానికి అంకితభావంతో ఉండండి "_
              _*- అబ్దుల్ కలాం*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
" గెలిచాక నీతో నడిచే వాళ్ళ కంటే.. గెలుపుకోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో. "

@    Class & Subject wise Study Material :

    #    6th Class    #    7th Class    #    8th Class    #    9th Class    #    10th Class